
రాజకీయాలు

పులివెందులలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కేసులు నమోదు చేసినట్లు పులివెందుల డీఎస్పీ వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా, ర్యాలీకి సంబంధించి ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాసులు కాల్చడంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన నిబంధనలపై అన్ని రాజకీయ పార్టీలకు ముందుగానే సమాచారం అందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని పార్టీలు, నాయకులు నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!