

అక్కినేని నాగార్జున మైల్‌స్టోన్ 100వ చిత్రం ‘కింగ్ 100’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ ఈ ప్రతిష్ఠాత్మక సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, అశోక్ సెల్వన్, రవీంద్ర విజయ్‌లతో పాటు సీనియర్ నటి టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం నుంచి అప్‌డేట్స్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత దసరా కానుకగా టబు పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాలతో అది వాయిదా పడింది.
తాజాగా అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. నవంబర్ 4న ఉదయం 9 గంటలకు టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి “మళ్లీ ఐకానిక్ జోడీ వచ్చేస్తోంది.. కానీ ఈసారి ప్రేమించుకోవడం కోసం కాదు” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేసింది. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రాల తర్వాత నాగార్జున, టబు మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాలో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. ఈ మైల్‌స్టోన్ చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!