
జనరల్

అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలపై పూర్తి అవగాహన కల్పించేందుకు అమెరికాస్ట్ కొత్త ఎపిసోడ్‌ను సిద్ధం చేసింది. అమెరికా కాంగ్రెస్‌లోని రెండు కీలక సభలైన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌పై ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందనే అంశాన్ని ఈ ఎపిసోడ్‌లో విశ్లేషించనున్నారు. మధ్యంతర ఎన్నికల ప్రాధాన్యత, వాటి ద్వారా అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాల గురించి వివరించనున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెలువడతాయి? ఎన్నికల ఫలితాలు ఏ సమయంలో ప్రకటిస్తారు? వంటి కీలక అంశాలను కూడా చర్చించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అధ్యక్ష పాలనపై ఎలాంటి ప్రభావం చూపవచ్చనే విషయాన్ని విశ్లేషించనున్నారు. వీటితో పాటు గవర్నర్ ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న మార్పుల గురించి కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో వివరించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!