

వృందావన్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు డిమాండ్ వచ్చింది. శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు దినేశ్ ఫలాహారి ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రేమానంద్ మహారాజ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఆశ్రమానికి సంబంధించిన కార్యకలాపాలపై విచారణ జరిపించాలని కోరారు. ఆశ్రమానికి సంబంధించిన వ్యవహారాల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయని, ఒక వర్గం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఉండగా, మరో వర్గం ఆస్తి వ్యవహారాల్లో పాల్గొంటోందని ఆయన లేఖలో ఆరోపించారు.
ఆశ్రమంలోని సీసీటీవీ ఫుటేజీని భద్రపరచడంతో పాటు అక్కడ పనిచేస్తున్న సేవాదారులకు పోలీసు వెరిఫికేషన్ చేయించాలని ఫలాహారి కోరారు. ఆశ్రమంలో ఉంటున్న పిల్లలకు సంబంధించిన అంశాలతో పాటు కిడ్నీ దొంగతనం ముఠా ఉందన్న అనుమానాలనూ లేఖలో ప్రస్తావించారు. అయితే, ఈ ఆరోపణలకు ఇప్పటివరకు స్వతంత్రంగా లేదా అధికారికంగా ధ్రువీకరణ లేదు. ఆశ్రమానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో భద్రత పెంచాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!