

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌పై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో దాదాపు 30 శాతం వర్షపాతం లోటు నమోదైంది. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ లోటు భర్తీ అయి రాష్ట్రం సాధారణ వర్షపాతం స్థాయికి చేరుకుందని అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, సిద్ధిపేట్, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా, ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారిక వాతావరణ సూచనలను పాటించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!