
రాజకీయాలు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఏకంగా రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. 44 ఏళ్లుగా వాసవి మార్కెట్‌లో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కమిటీ ఈసారి వినూత్నంగా కరెన్సీ నోట్ల అలంకరణను చేపట్టింది.
ఈ అలంకరణ కోసం మార్కెట్‌లోని వ్యాపారుల వద్ద నుంచి డబ్బును తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఎవరి నుంచి ఎంత మొత్తం తీసుకున్నారో, ఆ మొత్తాన్ని వారికి తిరిగి అందజేయనున్నట్లు చెప్పారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాథుడిని చూసేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!