5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!

Writer: Shivani K 09:00 PM, 5 నవంబర్, 2026
ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల షాక్‌ ఇవ్వనుంది. ముఖ్యంగా బడ్జెట్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్‌ అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతుండటంతో మెమొరీ చిప్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో మెమొరీ చిప్‌లు అవసరమవుతున్నాయి. దీంతో మొబైల్‌ తయారీ సంస్థల ఉత్పత్తి వ్యయం పెరిగి, ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. 2027లోనూ మెమొరీ చిప్‌లకు డిమాండ్‌ కొనసాగుతుందని, మొత్తం డిమాండ్‌లో ఏఐ కంపెనీల వాటా 60 శాతానికి చేరవచ్చని జెఫ్రీస్‌ నివేదిక వెల్లడించింది.

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీపై ఈ పరిణామాల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. 2025లో 20 డాలర్లుగా ఉన్న మెమొరీ చిప్‌ల ధరలు ప్రస్తుతం 60 నుంచి 65 డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. అందుబాటు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయంలో మెమొరీ చిప్‌ల వాటా సుమారు 60 శాతం వరకు ఉంటుందని తెలిపింది. ఈ కారణంగా బడ్జెట్‌ ఫోన్ల ధరలు దాదాపు 30 శాతం పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు మొబైల్‌ కంపెనీలు ధరలను పెంచే అవకాశం ఉంది. ఫలితంగా వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోలును వాయిదా వేసుకోవడం లేదా తక్కువ ధరకు లభించే రీఫర్బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్ల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని జెఫ్రీస్‌ అభిప్రాయపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌ఐసీకి భారీ ఊరట.. రెండో త్రైమాసికంలో పెరిగిన లాభాలు!

ఎల్‌ఐసీకి భారీ ఊరట.. రెండో త్రైమాసికంలో పెరిగిన లాభాలు!

శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లకు కొత్త విధానం..

శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లకు కొత్త విధానం..

క్రూడ్ ఆయిల్ ధరల పతనం.. మార్కెట్లకు భారీ బూస్ట్‌

క్రూడ్ ఆయిల్ ధరల పతనం.. మార్కెట్లకు భారీ బూస్ట్‌

అంతర్జాతీయ సానుకూల సంకేతాలు.. భారీ లాభాల్లో సూచీలు

అంతర్జాతీయ సానుకూల సంకేతాలు.. భారీ లాభాల్లో సూచీలు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
ట్యాగ్లు
స్మార్ట్‌ఫోన్ ధరలుబడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్లుమెమొరీ చిప్స్ఏఐ టెక్నాలజీజెఫ్రీస్ నివేదికమొబైల్ మార్కెట్స్మార్ట్‌ఫోన్ కొనుగోలుడేటా సెంటర్లురీఫర్బిష్డ్ ఫోన్లుటెక్నాలజీ వార్తలు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
జనరల్

తెలంగాణలో మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

పండుగ వేళ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. భారీగా నిధుల విడుదల!
బిజినెస్

పండుగ వేళ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. భారీగా నిధుల విడుదల!

నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
జనరల్

నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం
సినిమాలు

ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!
బిజినెస్

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!

‘రామాయణం’లో మరో సర్‌ప్రైజ్.. మేఘనాథుడిగా రాఘవ్‌ జుయల్‌!
సినిమాలు

‘రామాయణం’లో మరో సర్‌ప్రైజ్.. మేఘనాథుడిగా రాఘవ్‌ జుయల్‌!

అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!
జనరల్

అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్
రాజకీయాలు

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్

ఎల్‌ఐసీకి భారీ ఊరట.. రెండో త్రైమాసికంలో పెరిగిన లాభాలు!
బిజినెస్

ఎల్‌ఐసీకి భారీ ఊరట.. రెండో త్రైమాసికంలో పెరిగిన లాభాలు!

భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు..
క్రీడలు

భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు..

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!