

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు ముసురుకున్నాయి. భారత్తో పాటు పలు దేశాల్లో ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు పెరగడంతో అమెరికాలో మే నెల ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “ద్రవ్యోల్బణం అంటే నాకు ఇష్టం” అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అమెరికాలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ 4.2 శాతానికి పెరిగి, ఏప్రిల్ 2023 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ వ్యాఖ్యలపై డెమోక్రాటిక్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ, ప్రజల ఆర్థిక సమస్యలను ట్రంప్ పట్టించుకోవడం లేదని విమర్శించింది. ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు, ఇరాన్ పై అమెరికా దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగి బ్యారెల్‌కు 95.40 డాలర్లకు చేరడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల భారమూ పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!