
జనరల్

విక్రమ్-1 ఆర్బిటల్ క్లాస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ చందన, నాగ భరత్‌లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దిల్లీలో సోమవారం వీరిద్దరితో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని తెలిపారు. వారి శక్తిసామర్థ్యాలు, లక్ష్యాలు, సానుకూల దృక్పథం భారతదేశంలో ప్రైవేటు అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయని ప్రశంసించారు.
విక్రమ్-1 విజయంతో పాటు భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వెల్లడించారు. దేశ అంతరిక్ష సాంకేతిక అభివృద్ధిలో స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!