
ఆరోగ్యం

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పౌర సరఫరాల శాఖ తక్కువ ధరలకు బియ్యం విక్రయించాలన్న నిర్ణయాన్ని అభినందించారు. మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 బియ్యం మిల్లుల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1 నుంచి ఈ బియ్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలోకు రూ.52, గ్రేడ్ 1 పచ్చిబియ్యం కిలోకు రూ.50కు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలకు సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!