

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకు సముచిత రాజకీయ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిందని, అయితే రిజర్వేషన్లు కల్పించవద్దని చెప్పలేదని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని పార్థసారథి తెలిపారు. బీసీ గణనను త్వరగా పూర్తి చేసి, ఆమోదం పొందిన అనంతరం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంపై ఆ పార్టీకి నమ్మకం లేదని, గత రెండున్నరేళ్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించలేదని ఆరోపించారు. ఎన్నికల పట్ల కూడా వైఎస్సార్‌సీపీకి గౌరవం లేదని విమర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!