
జనరల్

హైదరాబాద్‌లోని మైత్రివనంలో తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలులో భాగంగానే మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్‌కు నివాళిగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!