
టెక్నాలజీ

భారత వాయుసేన వీర యోధులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు విధులు నిర్వర్తిస్తూ వాయుసేన సిబ్బంది ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు, అంకితభావం ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశ సేవలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. వారి ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిదాయకమని, దేశం కోసం వారు చేసిన త్యాగాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!