

ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులపై చర్చించారు. పోలవరం నిర్మాణాన్ని వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని సీఎం వివరించారు. ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో పెండింగ్‌లో ఉన్న ప్రజాభిప్రాయ సేకరణను వేగంగా పూర్తి చేయడంతో పాటు పోలవరం రక్షణ కరకట్టల పనులపై ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం వద్ద 41.15 మీటర్లు, 45.72 మీటర్ల కాంటూర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు చేపట్టాల్సిన పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ పనులపై కూడా చంద్రబాబు చర్చించారు. నిర్వాసితుల పునరావాసానికి ప్రాజెక్టు నిర్మాణంతో సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అలాగే గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న విషయాన్ని వివరించారు. రాష్ట్రంలోని 95 లక్షల గ్రామీణ కుటుంబాల్లో 62 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, తాజాగా 27 లక్షల కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించే పనులు ప్రారంభించామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పనులకు అనుగుణంగా నిధులు త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!