

భవిష్యత్తులో పిల్లలే కుటుంబానికి, సమాజానికి ఆస్తిగా మారతారని, వారిని భారం అనుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రంపచోడవరంలో నిర్వహించిన పీటీఎం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అర్హులైన వారందరికీ తల్లికి వందనం కింద ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకు రూ.10,120 కోట్లు జమ చేశామని, గిరిజన ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి రూ.664 కోట్లు అందించినట్లు వెల్లడించారు.
సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెబుతూ, శనివారం నో బ్యాగ్ డే, పౌష్టికాహారం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు నుంచి సంజీవని ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!