7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

Writer: Chandrika 08:13 PM, 7 సెప్టెంబర్, 2026
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ శాసన సభ్యులపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా చీరలు లాగడం, జుట్టు పట్టుకోవడం, గొంతులు పట్టుకోవడం వంటి దారుణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాల్లో ఉన్న రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

నిరసన తెలిపే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి పోలీసులను ఉపయోగించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గతంలో పార్లమెంట్‌లో టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన సందర్భాలను ప్రస్తావిస్తూ.. రాహుల్‌గాంధీకి ఒక నిబంధన, తమకు మరో నిబంధన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 1,000 రోజుల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలు, హామీల అమలు తీరును సభలో ప్రశ్నిస్తామనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు.

మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై హైకోర్టును ఆశ్రయించామని, ఈ అంశాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే బీఏసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు కనీసం నెల రోజుల పాటు కొనసాగాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దళిత, గిరిజన డిక్లరేషన్లపై ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. దళితబంధు, ఇందిరమ్మ ఇళ్లు, అసైన్‌డ్ భూములు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా వంటి అంశాల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డితెలంగాణ అసెంబ్లీబీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలుపోలీసుల చర్యలుఅసెంబ్లీ నిరసనతెలంగాణ ప్రభుత్వంబీఆర్‌ఎస్ నిరసన
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...
సినిమాలు

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...
రాజకీయాలు

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు
రాజకీయాలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?