
టెక్నాలజీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. సీతక్క మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనంతరం శాసనసభ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్‌కుమార్.. తాతా మధు వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని అన్నారు. సీతక్క గత ఐదేళ్లుగా తనకు రాఖీ కడుతున్నారని, సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయానని తెలిపారు. తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ శాసనసభలో తీర్మానం చేసి శాసనమండలికి పంపిస్తామని స్పీకర్ ప్రసాద్‌కుమార్ వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!