

బెంగళూరులో ట్రాఫిక్ సమస్య మరోసారి ఆఫీస్ కల్చర్‌పై చర్చకు దారితీసింది. ఓ స్టార్టప్ ఫౌండర్ ఉదయం 10:15 గంటలకు తన ఆఫీస్‌లో సగం మంది మాత్రమే ఉన్నట్లు చూపించే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉద్యోగులు ఆలస్యంగా రావడానికి నగరంలో తీవ్రంగా ఉండే ట్రాఫిక్ ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
తన వ్యక్తిగత ప్రయాణ అనుభవాన్ని కూడా ఆయన పంచుకున్నారు. కేవలం 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఒకసారి దాదాపు రెండు గంటలు పట్టిందని తెలిపారు. దీంతో బెంగళూరులో ముందుగా ఆఫీస్‌కు రావాలనే నిబంధనలు ఎంతవరకు ఆచరణీయమనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
సిల్క్ బోర్డ్, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రధాన మార్గాల్లో ప్రతిరోజూ భారీ ట్రాఫిక్‌ను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు సమయానికి ఆఫీస్‌కు చేరుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. మరోవైపు కంపెనీలు ఆఫీస్‌లో కలిసి పనిచేయడం, సమయపాలన, డిసిప్లిన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వంటి నగరాల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, హైబ్రిడ్ వర్క్ విధానాలు మరింత అనుకూలంగా ఉంటాయా అనే చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!