
జనరల్

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం చంద్రబాబు ఢిల్లీ బయల్దేరతారు. రాత్రి అక్కడే బస చేసి గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అలాగే జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
పోలవరం–నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి అనుమతులు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు రెండో దశకు రూ.42,000 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు జలశక్తి మంత్రిని కోరనున్నట్లు సమాచారం. అలాగే పోలవరం స్పిల్‌వేపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.2,300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం రాత్రి చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!