
జనరల్

మయన్మార్–అండమాన్ ప్రాంతాల మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మయన్మార్–బంగ్లాదేశ్ తీరాల వైపు పయనిస్తోంది. రానున్న 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అంచనా.
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముంది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!