
గాసిప్స్

మయన్మార్, అండమాన్ ప్రాంతాల మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం ఈశాన్య దిశగా పయనిస్తూ.. 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం కదలిక, తీవ్రతను బట్టి వాతావరణ పరిస్థితుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!