
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడతకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో రాష్ట్రంలోని ఎంపిక చేసిన మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 23 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.
డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. మూడో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 27 చివరి తేదీగా నిర్ణయించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!