

ఒమన్ తీర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన క్షిపణి దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయం, ఒమన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఏపీ భవన్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టగా, ఒమన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సురేష్ ప్రయాణిస్తున్న నౌక ఒమన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయినట్లు సమాచారం. నౌకను పోర్టుకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని, అధికారిక గుర్తింపు అనంతరం మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!