
ఆరోగ్యం

ఐసీసీ విడుదల చేసిన తాజా మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తున్న మంధాన మరోసారి నంబర్-1 బ్యాటర్‌గా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
శ్రీలంకతో జరుగుతున్న ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో రెండో వన్డేలో అద్భుత సెంచరీతో మెరిసిన పాకిస్థాన్ బ్యాటర్ సిద్రా అమీన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 671 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. దీంతో 652 రేటింగ్ పాయింట్లు ఉన్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పదో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్ మహిళల వన్డే క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాటర్ల మధ్య పోటీ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో మరోసారి చాటిచెప్పాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!