

స్నేహితురాలు తనతో మాట్లాడటం మానేసిందన్న కారణంతో ఓ యువకుడు ఆమె తండ్రిని కిడ్నాప్ చేసిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషభ్ నాహటా అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి అక్టోబర్ 1న అల్తాన్‌లోని వ్యాపారవేత్త ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి ఇంట్లో లేకపోవడంతో ఆమె తండ్రితో రిషభ్‌కు వాగ్వాదం జరిగింది. పరిస్థితి తీవ్రం కావడంతో ముగ్గురూ పిస్టల్‌తో బెదిరించి వ్యాపారవేత్తను బలవంతంగా తమతో తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సాంకేతిక నిఘా ద్వారా వారి ఆచూకీ గుర్తించి కొన్ని గంటల్లోనే వ్యాపారవేత్తను సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో రిషభ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో రిషభ్.. వ్యాపారవేత్త కుమార్తె తన మరో మహిళా స్నేహితురాలిని ఫోన్‌లో దుర్భాషలాడిందని, దీనిపై వివరణ కోరేందుకే ఆమె ఇంటికి వెళ్లినట్లు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వాదనపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.41.40 లక్షల విలువైన వస్తువులు, ఘటనకు సంబంధించిన ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ వెనుక పూర్తి కారణాలు, నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!