4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

Writer: Nithish 05:59 AM, 4 అక్టోబర్, 2026
గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి అవకాశం దక్కని బీసీలు, ఇతర నేతలతో శనివారం గాంధీభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో పార్టీ నుంచి మరిన్ని అవకాశాలు ఉంటాయని, టికెట్‌ రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదని వారికి సూచించారు. కాంగ్రెస్‌ మద్దతుతో బరిలో ఉన్న ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తే కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని సమావేశంలో నేతలు కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కని బీసీ కులాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ఇప్పటివరకు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలు, ప్రాంతాలకు పదవులు, టికెట్ల కేటాయింపులో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ కోటాలోని మూడు స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరగా, కనీసం రెండు స్థానాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, మూడో స్థానంపైనా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని మహేశ్‌కుమార్‌గౌడ్‌ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓబీసీల కులగణన డిమాండ్‌పై ఆదివారం శంషాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్‌ వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. SIRపై దేశవ్యాప్తంగా ఇండియా కూటమి చేపట్టనున్న ఉద్యమంపై చర్చించేందుకు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌

కాంగ్రెస్‌ సీఎంలు రాజీనామా చేసి బ్యాలెట్‌ ఎన్నికలకు రావాలి - బండి సంజయ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

ట్యాగ్లు
మహేశ్‌కుమార్‌గౌడ్‌తెలంగాణ కాంగ్రెస్‌గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీబీసీ రిజర్వేషన్లుబీసీ ప్రాతినిధ్యంగ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలుకాంగ్రెస్‌గాంధీభవన్‌ఓబీసీ కులగణనSIR
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్
జనరల్

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా
జనరల్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
జనరల్

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం