

బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో దుబాయ్ నుంచి భారత్కు బంగారం దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. భారత్-యూఏఈ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ప్రకారం, టారిఫ్ రేట్ కోటా కింద దుబాయ్ నుంచి వచ్చే బంగారంపై సాధారణ సుంకంతో పోలిస్తే 1 శాతం తక్కువ పన్ను మాత్రమే విధించబడుతోంది. ప్రస్తుతం సాధారణ దిగుమతి సుంకం 15 శాతం ఉండగా, దుబాయ్ కోటా కింద వచ్చే బంగారంపై 14 శాతం మాత్రమే పన్ను పడుతోంది.
వెండిపై కూడా ఇదే తరహా పరిస్థితి ఉందని జీటీఆర్ఐ పేర్కొంది. సాధారణంగా వెండిపై 15 శాతం సుంకం ఉండగా, యూఏఈ నుంచి వచ్చే వెండిపై ప్రస్తుతం 7 శాతం మాత్రమే సుంకం విధిస్తున్నారు. ఈ వ్యత్యాసం కారణంగా దుబాయ్ మార్గం ద్వారా వెండి దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2022లో 120 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతులు 2027 నాటికి 200 టన్నులకు చేరవచ్చని జీటీఆర్ఐ అంచనా వేసింది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్లను మరింత సరళతరం చేయాలని సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!