

ఇటీవలి కాలంలో దేశంలోని పలు నగరాల్లో వెలుగులోకి వచ్చిన బ్యాంక్ లాకర్ వివాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగళూరులో రూ.24 లక్షల విలువైన బంగారం, ఢిల్లీలో రూ.60 లక్షల నగలు లాకర్ల నుంచి మాయమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బ్యాంక్ లాకర్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగినా, కస్టమర్ చెల్లించే వార్షిక లాకర్ అద్దెకు వంద రెట్లు మాత్రమే పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు ఏడాదికి రూ.7,000 అద్దె చెల్లిస్తే గరిష్ఠంగా రూ.7 లక్షల పరిహారం మాత్రమే లభించే అవకాశం ఉంటుంది.
విలువైన నగలు, పత్రాల రక్షణకు బహుళ భద్రతా విధానాన్ని అనుసరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నగల బీమా, క్రమం తప్పకుండా విలువ నిర్ధారణ, గృహ భద్రతా పెట్టెలు, గృహ బీమా, డిజిటల్ పత్రాల భద్రత, పత్రాల ప్రతులను భద్రపరచడం వంటి చర్యలు అవసరమని పేర్కొంటున్నారు. బ్యాంక్ లాకర్ ఒక్కటే పూర్తి భద్రత కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!