
జనరల్

యూపీఐ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వినియోగదారుల డేటా భద్రత, గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యూపీఐ యాప్‌లు, బ్యాంకులు లావాదేవీల సమయంలో వినియోగదారుల ఫోన్ నంబర్లు కనిపించకుండా మాస్కింగ్ చేయాలని ఆదేశించింది.
ఈ నిబంధన అమలుకు సెప్టెంబర్ 4 వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో వినియోగదారులను గుర్తించడానికి, చెల్లింపులను ధ్రువీకరించడానికి ఫోన్ నంబర్లు ఉపయోగిస్తున్నప్పటికీ, అవి బహిర్గతం కావడం వల్ల గోప్యత, భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!