13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

Writer: Nithish 06:17 PM, 13 సెప్టెంబర్, 2026
మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

సైబర్‌ నేరాలు, అక్రమ లావాదేవీలకు ఉపయోగించే మనీ మ్యూల్‌ ఖాతాల నియంత్రణకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. సైబర్‌ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును బదిలీ చేసేందుకు ఉపయోగించే అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకులు విధించే తాత్కాలిక డెబిట్‌ హోల్డ్‌ను గరిష్ఠంగా 60 రోజులకు పరిమితం చేయాలని ముసాయిదాలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై బ్యాంకులు, ప్రజల నుంచి అక్టోబర్‌ 2 వరకు సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. తుది మార్గదర్శకాలు 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే బ్యాంకులు కోరుకుంటే అంతకుముందే అమలు చేయవచ్చు.

కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) సాంకేతికతల సాయంతో అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు గుర్తించనున్నాయి. రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఉన్న సందేహాస్పద బదిలీలను గుర్తించిన వెంటనే తాత్కాలిక డెబిట్‌ హోల్డ్‌ విధించవచ్చు. ఖాతాదారుడి సాధారణ లావాదేవీలకు భిన్నంగా ఉండటం, భారీగా నిధులు జమ కావడం లేదా సైబర్‌ నేరాలకు సంబంధించిన ఖాతాలతో సంబంధం ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అనుమానాస్పద మొత్తానికే హోల్డ్‌ పరిమితం చేయగలిగితే మొత్తం ఖాతాను నిలిపివేయకూడదని ఆర్‌బీఐ సూచించింది. హోల్డ్‌ విధించిన వెంటనే కారణాలు, తొలగించుకునే విధానం, సంబంధిత అధికారి వివరాలను ఖాతాదారుడికి తెలియజేయాలి. వివరణ ఇచ్చేందుకు 20 రోజులు, అనంతరం బ్యాంకు నిర్ణయం తీసుకునేందుకు 10 రోజులు గడువు ఉంటుంది. పోలీసుల ఆదేశాలు లేకపోతే తాత్కాలిక డెబిట్‌ హోల్డ్‌ గరిష్ఠంగా 60 రోజులు మాత్రమే కొనసాగాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?
ట్యాగ్లు
ఆర్‌బీఐమనీ మ్యూల్ ఖాతాలుసైబర్ నేరాలుడెబిట్ హోల్డ్అక్రమ లావాదేవీలుఆర్‌బీఐ నిబంధనలుబ్యాంకింగ్సైబర్ క్రైమ్అనుమానాస్పద ఖాతాలుడిజిటల్ మోసాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
జనరల్

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు