

రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. శనివారం రాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ టెన్నిస్ క్రీడాకారిణి డయానా యస్ట్రెమ్స్కాకు చెందిన అపార్ట్‌మెంట్ ధ్వంసమైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులెవరూ ప్రమాదానికి గురికాలేదని తెలిపింది. తన ఇంటికి సంబంధించిన దృశ్యాలను పంచుకుంటూ.. ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో ఉపయోగించిన రోలాండ్ గారోస్ టవల్ మాత్రమే మిగిలిందని పేర్కొంది.
ఈ ఘటనపై యస్ట్రెమ్స్కా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రష్యా క్షిపణి దాడిలో తన ఇల్లు ధ్వంసమైనా.. తన కుటుంబం సురక్షితంగా ఉందని తెలిపింది. ఉక్రెయిన్ కోణంలో చూస్తే అంతర్జాతీయ సమాజం అనుసరిస్తున్న ‘తటస్థత’కు ఇదే అసలైన అర్థమంటూ వ్యాఖ్యానించింది. 2024 డిసెంబరులోనూ ఆమె కుటుంబానికి చెందిన బామ్మ కాలం నాటి ఇల్లు రష్యా దాడుల్లో ధ్వంసమైనట్లు గతంలో వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!