

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు మరింత విలాసవంతమైన సౌకర్యాలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తన అంతర్జాతీయ విమానాల్లో పూర్తిగా ఫ్లాట్‌బెడ్‌గా మారే బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ సీట్ల ప్రత్యేకత ఏమిటంటే.. ప్రయాణికులు తమ సీట్లను పూర్తిగా చదునుగా మార్చుకుని పడుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఇండిగో తన అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణ వ్యూహంలో భాగంగా రాబోయే ఎయిర్‌బస్ ఏ350, ఏ321ఎక్స్‌ఎల్‌ఆర్ విమానాల్లో ఈ సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నిర్ణయంతో ప్రీమియం ప్రయాణ సేవలపై సంస్థ మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరసమైన విమాన ప్రయాణాలకు గుర్తింపు పొందిన ఇండిగో.. కొత్త బిజినెస్ క్లాస్ సదుపాయాలతో అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!