

వెండి ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టిన తర్వాత తాజాగా ఒక్కసారిగా పెరిగాయి. గురువారం ఉదయం 7 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,10,100గా నమోదైంది. అక్టోబర్ 28వ తేదీ వరకు కిలో వెండి ధర రూ.2,20,000గా ఉండగా, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అక్టోబర్ 31వ తేదీన కిలో వెండి ధర రూ.2,00,000కు పడిపోయింది. అప్పటి నుంచి అదే ధర స్థిరంగా కొనసాగింది. అయితే తాజాగా రజితం ధర మళ్లీ పెరగడంతో వెండి కొనుగోలుదారుల దృష్టి మార్కెట్‌పై పడింది.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో కిలో వెండి ధర రూ.2,10,100గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతిలోనూ ఇదే ధర కొనసాగుతోంది. దేశంలోని ఇతర నగరాల్లో చెన్నై, కేరళంలో కిలో వెండి ధర రూ.2,10,100గా ఉండగా, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, పుణె, వడోదరలో రూ.1,99,900గా నమోదైంది. వెండి ధరలు నగరాలను బట్టి మారే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను పరిశీలించాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!