

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పరిటాల కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. నసనకోట ప్రభుత్వ పాఠశాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ ఓటు వేశారు. అనంతరం పరిటాల సునీత మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నేతలు అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలో రిగ్గింగ్ జరుగుతోందని వైసీపీకి చెందిన కొందరు చేస్తున్న ఆరోపణలు సరికాదని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మరోవైపు, ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేయబోతుందని పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 12.66 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు వివిధ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!