
జనరల్

ప్రముఖ నటి నయనతార చెన్నైలోని ప్రసిద్ధ కాళికాంబల్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు భక్తులకు అన్నప్రసాదం అందించారు. నయనతార ఆలయ సందర్శనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూకుతి అమ్మన్ 2’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు నయనతార ఆలయాన్ని సందర్శించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!