

అనవసర గొడవలకు దూరంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. నాయకులంతా క్షేమంగానే ఉంటారని, ఇలాంటి గొడవల వల్ల నష్టపోయేది కింది స్థాయి కేడర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ వారంలో యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో చోటుచేసుకున్న ఘటనలపై స్పందించారు. ఈ సంఘటనల వల్ల నష్టపోయింది కార్యకర్తలేనని గుర్తించి, ఇకపై గొడవల జోలికి వెళ్లవద్దని వారికి సూచించారు.
ఇటీవల జరిగిన ఘర్షణల్లో నష్టపోయిన వారికి ఎన్నికల అనంతరం తనకు చేతనైన సాయం చేయాలని భావిస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. యల్లనూరు, పుట్లూరు మండలాల్లో జరిగిన ఘటనల వల్ల నష్టపోయిన వారికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మండలాల్లో ఫ్యాక్షన్ పూర్తిగా అంతరించి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!