
జనరల్

ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ వద్ద కలకలం రేగింది. సముద్రం నుంచి ఓ బోటు తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు గమనించి పరిశీలించగా.. అందులో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై తీర ప్రాంతంలో ఆందోళన నెలకొంది. బోటు తీరానికి ఎలా చేరింది? అందులో ఉన్నవారికి ఏం జరిగింది? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది.
స్థానికులకు అందిన సమాచారం ప్రకారం.. బోటులో సుమారు 15 మంది మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బోటు చెన్నైకి చెందినదిగా అనుమానిస్తున్నారు. అయితే బోటు యజమాన్యం, మృతుల వివరాలు, మిగిలిన మత్స్యకారుల ఆచూకీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల పరిశీలన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!