

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు సరఫరా అంతరాయం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ దేశంలో ప్రస్తుతం 74 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ వంటి చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 90 రోజుల వరకు నిల్వలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. యుద్ధాలు, ఆంక్షలు లేదా సరఫరా అంతరాయం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యూహాత్మక నిల్వలు దేశ ఇంధన భద్రతకు కీలకంగా మారతాయి.
దేశంలో ముడి చమురు నిల్వలను ప్రత్యేకంగా నిర్మించిన భూగర్భ రాతి గుహల్లో నిల్వ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో ఈ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 5.33 మిలియన్ టన్నులు. ఒడిశాలోని చాందిఖోల్ వద్ద కొత్త కేంద్రం నిర్మాణం జరుగుతుండగా, పడూర్ కేంద్ర విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే రాజస్థాన్లోని బికనేర్, మధ్యప్రదేశ్లోని బినా ప్రాంతాల్లో కొత్త నిల్వ కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నిల్వలను ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తూ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!