

ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ సరసన నటించిన అలా వైకుంఠపురములో చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఆ తర్వాత పలు పెద్ద ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. అయితే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవడంతో పాటు, టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం తమిళం, బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు.
ఇటీవల పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ చాలా నిజాయితీ గల వ్యక్తి అని, ఆయనకు కుట్రలు, కుతంత్రాలు తెలియవని ప్రశంసించారు. మనసులో ఉన్నదాన్ని నేరుగా చెప్పే స్వభావం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. కొంతమంది వ్యక్తులు రాజకీయాలు చేస్తుంటారని, కానీ సల్మాన్ మాత్రం జెన్యూన్ పర్సన్ అని పేర్కొన్నారు. అలాగే ప్రభాస్ పేరు వినగానే తనకు ఆహారం గుర్తుకొస్తుందని, హృతిక్ రోషన్ నుంచి డ్యాన్స్‌లో సంగీతాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!