
రాజకీయాలు

జియో కస్టమర్లు ఇక విదేశాలకు వెళ్లినా తమ సిమ్ మార్చుకోకుండానే 5జీ రోమింగ్ సేవలను పొందే అవకాశం కల్పించేందుకు రిలయన్స్ జియో, అమెరికా టెలికాం సంస్థ టి-మొబైల్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జియో, టి-మొబైల్ కస్టమర్లు విదేశాలకు వెళ్లినప్పుడు స్థానిక సిమ్ మార్చాల్సిన అవసరం లేకుండానే 5జీ స్టాండ్‌ఎలోన్ రోమింగ్ సేవలను వినియోగించుకోవచ్చని రెండు సంస్థలు తెలిపాయి.
ఈ సేవను ప్రపంచంలోనే తొలి 5జీ స్టాండ్‌ఎలోన్ రోమింగ్ సర్వీస్‌గా జియో, టి-మొబైల్ పేర్కొన్నాయి. కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ సినివర్స్ ఈ భాగస్వామ్యంలో రెండు సంస్థలకు అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. ఈ సాంకేతిక భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో సిమ్ మార్చాల్సిన అవసరం లేకుండా 5జీ కనెక్టివిటీని కొనసాగించే అవకాశం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!