

అరుదైన ఖనిజాల అన్వేషణ, వెలికితీతలో అమెరికన్ సంస్థలతో కలిసి పనిచేయడానికి సింగరేణి సంస్థ సిద్ధంగా ఉందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు చెందిన పొలిటికల్, ఎకనామిక్ విభాగం అధిపతి మెరెడిత్ మెజ్లర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం శుక్రవారం సింగరేణి భవన్‌లో బుద్ధప్రకాశ్ జ్యోతితో సమావేశమైంది. ఈ సందర్భంగా మైనింగ్ సాంకేతికత, ఉమ్మడి భాగస్వామ్యం, ఇతర సహకార అవకాశాలపై ఇరువర్గాలు సుదీర్ఘంగా చర్చించాయి.
మైనింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని సింగరేణి కోరుకుంటోందని బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు. దీనిపై స్పందించిన అమెరికా ప్రతినిధుల బృందం తమ దేశంలో అరుదైన ఖనిజాల రంగంలో పనిచేస్తున్న సంస్థలతో కలిసి ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ చర్చలతో మైనింగ్, అరుదైన ఖనిజాల రంగాల్లో సింగరేణి-అమెరికా సంస్థల మధ్య సహకారానికి మార్గాలు అన్వేషించే అవకాశం ఏర్పడింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!