

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ నేడు (నవంబర్ 7) తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1954 నవంబర్ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించిన ఆయన, 1960లో విడుదలైన కళత్తూర్ కన్నమ్మ చిత్రంతో బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం తదితర భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాత, కథా రచయిత, గాయకుడు, గేయ రచయిత, కొరియోగ్రాఫర్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
సినీ రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా పలు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినిమాలతో పాటు ప్రజా జీవితంలోనూ చురుకుగా ఉంటూ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన కుమార్తె అక్షర హాసన్ కూడా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. మరోవైపు, దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ నటిస్తున్న సండియర్ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!