

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (నవంబర్ 7) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం సాధారణ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 9,062 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి, దాదాపు 39,694 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో టేబుల్‌పై సుమారు వెయ్యి బ్యాలెట్ పత్రాలను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు, 659 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో 2,051 ఎంపీటీసీ, 77 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. మొత్తం 21,012 మంది అభ్యర్థుల ఫలితాలు వెలువడనున్నాయి. ఐదు జిల్లాల్లోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ కూడా పూర్తయింది. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 365 కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ వోర్న్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!