

ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఐదు హెల్త్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చర్యలు తీసుకుంది. వేదాంత్ రెమెడీస్, లూసిడ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, అంబికో ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, విటామెడిక్ హెల్త్ న్యూట్రాస్యూటికల్స్, అడోరియల్ హెల్త్‌కేర్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఆయా సంస్థల తయారీ కేంద్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో పలు లోపాలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తయారీ కేంద్రాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, అవసరమైన మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వినియోగదారుల ఆరోగ్యానికి భద్రత కల్పించేందుకు తనిఖీలు, పర్యవేక్షణను మరింత కఠినతరం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!