

కేరళలోని ఉగ్రపురానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఫేస్ క్రీమ్ వాడిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటన చూసి ‘ఎఫ్ ట్యూన్’ అనే క్రీమ్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ క్రీమ్ వాడిన అనంతరం బాలిక ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షల సమయంలో ఆ క్రీమ్‌లో మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే మెర్క్యురీ (పాదరసం) మోతాదు అనుమతించిన పరిమితికి మించి ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బాలిక కిడ్నీలు దెబ్బతిని తీవ్ర పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు ఫేస్ క్రీమ్ తయారీదారుపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ప్రకటనల ద్వారా విక్రయించే సౌందర్య ఉత్పత్తుల భద్రతపై ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ, నాణ్యతలేని సౌందర్య ఉత్పత్తులపై తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆన్‌లైన్‌లో సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు వాటి తయారీ వివరాలు, పదార్థాలు, అనుమతులను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!