23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

Writer: Pooja 12:45 PM, 23 నవంబర్, 2026
ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి అత్యాధునిక ఏఐ చిప్స్ చైనాకు చేరాయన్న ఆరోపణలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఎన్విడియా సంస్థకు చెందిన కీలక చిప్స్ అక్రమంగా తరలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేపట్టాయి. ఈ వ్యవహారంలో సింగపూర్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ ‘మెగాస్పీడ్’ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సున్నితమైన సెమీకండక్టర్ సాంకేతికత ఇతర దేశాలకు మళ్లుతోందన్న అనుమానాలతో అమెరికా వాణిజ్య శాఖ 2024లోనే ఈ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. 2025 మేలో ఎన్విడియా చిప్స్ విక్రయాల వివరాలను కోరగా, అదే ఏడాది జూన్‌లో మెగాస్పీడ్‌ను ఎన్విడియా నో సెల్ జాబితాలో చేర్చింది. బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ (బీఐఎస్) సింగపూర్ అధికారులతో కలిసి మెగాస్పీడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, అప్పటి సీఈఓ ఆలిస్ హువాంగ్‌ను విచారించింది. అనంతరం అమెరికా న్యాయశాఖ ఈ వ్యవహారంపై నేరపూరిత కోణంలో దర్యాప్తు ప్రారంభించింది.

ఈ వ్యవహారంపై ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్.. ఎన్విడియా చిప్స్ పొందేందుకు కొందరు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇప్పటికే కొన్ని కంపెనీలపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అయితే ఆలిస్ హువాంగ్‌కు చైనా నిఘా సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇంకా తుది నిర్ధారణకు రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు, విదేశీ డేటా సెంటర్లలోని సర్వర్ల ద్వారా కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు తీసుకుని అమెరికా ఎగుమతి ఆంక్షలను అధిగమించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఐఎస్ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఎన్విడియా కూడా ఎగుమతి నియంత్రణల పర్యవేక్షణ కోసం బోర్డు సభ్యురాలు సుజాన్ నోరా జాన్సన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున, ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఎవరినీ దోషులుగా పరిగణించరాదని నిపుణులు పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

ట్యాగ్లు
ఎన్విడియా ఏఐ చిప్స్చైనా చిప్స్ అక్రమ రవాణాఅమెరికా ఆంక్షలుమెగాస్పీడ్ సంస్థఆలిస్ హువాంగ్సెమీకండక్టర్ దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం
రాజకీయాలు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు
సినిమాలు

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
టెక్నాలజీ

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ
బిజినెస్

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

త్రిష రాజకీయాల్లోకి? జయలలిత బిరుదుతో కొత్త అభిమాన సంఘం!
రాజకీయాలు

త్రిష రాజకీయాల్లోకి? జయలలిత బిరుదుతో కొత్త అభిమాన సంఘం!

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు
బిజినెస్

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం
సినిమాలు

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

న్యూయార్క్‌లో చైనీస్ స్పై లుక్‌అలైక్ పోటీ
జనరల్

న్యూయార్క్‌లో చైనీస్ స్పై లుక్‌అలైక్ పోటీ

మరోసారి కాంగ్రెస్‌దే అధికారం.. ఉత్తమ్, తుమ్మల ధీమా!
రాజకీయాలు

మరోసారి కాంగ్రెస్‌దే అధికారం.. ఉత్తమ్, తుమ్మల ధీమా!

బీజేపీపై కోమటిరెడ్డి ఫైర్..!
రాజకీయాలు

బీజేపీపై కోమటిరెడ్డి ఫైర్..!

త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం
జనరల్

త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!