

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు బిగ్‌బాస్ తెలుగు 10 వేదికపై ఊహించని అనుభవం ఎదురైంది. తన అప్‌కమింగ్ మూవీ ‘మైసా’ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం ఎపిసోడ్‌లో ఆమె సందడి చేసింది. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ ముఖేష్ గౌడను పిలిచారు. రష్మికతో మైసూరు లేదా బెంగళూరు కన్నడలో మాట్లాడొచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇంతలో ముఖేష్ అసలు విషయం వెల్లడించడంతో రష్మిక ఆశ్చర్యపోయింది.
రష్మిక తనకు కాలేజీ జూనియర్ అని ముఖేష్ గౌడ చెప్పాడు. తన స్నేహితులు ఆమెతో కలిసి చదువుకున్నారని, అప్పట్లో తాను కూడా రష్మికను చూశానని వెల్లడించాడు. ఈ అనుకోని పరిచయంతో రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో ఆమె నటనను ముఖేష్ ప్రశంసించడంతో మరింత సంతోషించింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సినిమా ‘మైసా’ చూడాలని అతడిని కోరింది. ‘నిహార్ ముఖేష్’గా కూడా గుర్తింపు పొందిన ముఖేష్.. కన్నడ, తెలుగు టెలివిజన్ రంగాల్లో నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి పాత్రతో గుర్తింపు పొందారు. మరోవైపు రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైసా’ గిరిజన నేపథ్యంతో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా. ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్లు సమాచారం. కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!