
రాజకీయాలు

వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ఫాస్ట్ భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2027 ప్రథమార్ధంలో భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారతీయ వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఈ స్కూటర్లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విన్ఫాస్ట్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలో పలు సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో పోటీపడుతుండగా, విన్ఫాస్ట్ ప్రవేశంతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త మోడళ్లతో భారత ఈవీ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!