
జనరల్

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆవరణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ వెలుపల ఉన్న మూడు ఏటీఎంలు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నాలుగు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నియంత్రించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!