
జనరల్

తాడిచర్ల 2 గనిని సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి, చప్పట్లతో తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వ చొరవ కీలకమని వారు పేర్కొన్నారు.
ఈ గని కేటాయింపుతో ఉద్యోగ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు, సింగరేణి సంస్థ విస్తరణకు, కార్మికుల సంక్షేమానికి ఊతం లభిస్తుందని కార్మిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. తమ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కిషన్ రెడ్డికి కార్మికులు, సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!